ఆ ఇద్దరిని పట్టిస్తే రూ.లక్ష రివార్డ్: గుజరాత్ ప్రభుత్వం

ఆ ఇద్దరిని పట్టిస్తే రూ.లక్ష రివార్డ్: గుజరాత్ ప్రభుత్వం

వామ్మో వీళ్లు మామూలోళ్లు కాదు..ఒక్కో తలపై లక్ష రూపాయల రివార్డు ప్రకటించారంటేనే అర్థమవుతోంది వీళ్లు ఘనకార్యం పెద్దదే అని.. అనిల్ అలియాస్ జగదీష్ ప్రసాద్ జాట్, ఆశీష్ అలియాస్ అషు రమేష్ చంద్ర అగర్వాల్..ఇద్దరు అక్రమ లిక్కర్  రవాణాలో తోడుదొంగలు..రాజస్థాన్-గుజరాత్ లలో లిక్కర్ కింగులు.. వీరి కను సన్నల్లోనే లిక్కర్ అక్రమ దందా సాగుతోంది. వీరి ఆగడాలు భరించలేక గుజరాత్ ప్రభుత్వం ఈ తోడుదొంగలను పట్టించిన వారికి లక్ష రూపాయల నగదు ఇస్తామని ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. 

రాజస్థాన్-గుజరాత్ సరిహద్దుల ద్వారా అక్రమ లిక్కర్ సరఫరా చేస్తున్న కీలక సూత్రధారులు రాజస్థాన్ కు చెందిన అనిల్ అలియాస్ పద్య జగదీష్ ప్రసాద్ జాట్, ఆశీష్ అలియాస్ అషు రమేష్ చంద్ర అగర్వాల్ పై  గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రూ. 1లక్ష రూపాయల రివార్డు ప్రకటించింది. గతంలో ఈ ఇద్దరిపై రూ.20వేల రివార్డు ఉండేది.. తాజాగా రివార్డును పెంచుతూ నిర్ణయించింది. 

రాష్ట్రంలో బూట్ లెగ్గింగ్ కార్యకలాపాలను అరికట్టడానికి వాంటెడ్ బూట్ లెగర్లను అరెస్ట్ చేయడానికి గుజరాత్ హోంశాఖ ఈ నగదు రివార్డును ప్రకటించింది. ఈ ప్రకటన మొత్తం 10 మంది వాంటెడ్ బూట్ లెగర్ లకు వర్తిస్తుంది. ఈ మేరకు వారి పేర్లను హోంశాఖ విడుదల చేసింది. వారి ఆచూకీ తెలిస్తే తగు సమాచారం ఇచ్చిన వారికి రివార్డు ఇస్తామని పేర్కొంది. ఈ బూట్ లెగర్లలో ఎక్కువ మంది రాజాస్థాన్ కు చెందిన వారు కాగా ఒకరు గుజరాత్ కు చెందిన వారు. 

బూట్ లెగ్గింగ్ పై ఈ అణచివేత గుజరాత్  ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతకు భరోసానిస్తుందని, సమాచార భాగస్వామ్యం ప్రోత్సహించడం ద్వారా ఈ వాంటెడ్ వ్యక్తులను చురుకుగా పట్టుకనేందుకు ప్రయత్నం, రాష్ట్రంలో అక్రమ లిక్కర్ రవాణాను అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.