
- గుజరాత్లో దారుణం
రాజ్‌కోట్ : గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తన తల్లిని చంపి సోషల్ మీడియాలో ఫొటో షేర్చేశాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. జ్యోతిబెన్ గోసాయి(48) అనే మహిళ తన భర్తతో విడిపోయి పెద్ద కొడుకు నీలేష్ గోసాయి(21)తో కలిసి రాజ్‌కోట్ ఏరియాలో నివసిస్తోంది. ఆమె కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. కొడుకుతో తరచూ గొడవ పడేది. ఒకరిపై ఒకరు భౌతికదాడులు కూడా చేసుకునే వారని పోలీసులు తెలిపారు.
శనివారం రాజ్‌కోట్‌లోని యూనివర్సిటీ రోడ్‌లో ఉన్న భగత్‌సిన్హ్‌జీ గార్డెన్‌లో నీలేశ్ తన తల్లిపై కత్తితో దాడికి యత్నించాడు. దీంతో ఆమె కత్తిని లాక్కొని పడేసింది. అనంతరం అతడు దుప్పటిని ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. ఘటన తర్వాత అతడు తన తల్లి డెడ్‌బాడీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
అలాగే, "సారీ అమ్మ నేను నిన్ను చంపాను. నేను నిన్ను మిస్అయ్యాను. ఓం శాంతి " అని పోస్ట్ చేశాడు. నీలేష్ తన తల్లిని చంపి డెడ్‌బాడీ దగ్గరే కూర్చోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు స్పాట్‌కు చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.