ఈ ఆఫీసర్ ఎంత పనిచేశాడు.. గన్తో గేమ్స్ ఆడుతుండగా భార్య మృతి.. 108 కాల్ చేసి భర్త సూసైడ్

ఈ ఆఫీసర్ ఎంత పనిచేశాడు.. గన్తో గేమ్స్ ఆడుతుండగా భార్య మృతి.. 108 కాల్ చేసి భర్త సూసైడ్

ఖాన్ తో గేమ్స్ ఆడకు.. పుచ్చ పేలిపోద్ది.. అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఖాన్ తో పెట్టుకుంటే పుచ్చ పేలుతుందో లేదో కానీ.. గన్ తో పెట్టుకుంటే మాత్రం జరిగేది అదే. సరదాగా రివాల్వర్ తో ఆడుకునే అలవాటు నూతన దంపతుల ప్రాణాలు తీసింది. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు.. వెకేషన్ కు యూఎస్ వెళ్లొద్దామనుకున్న కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. మెరీటైమ్ (నౌకాశ్రయ) అధికారి కుటుంబం అంతమైన తీరు గుజరాత్ లో సంచలనంగా మారింది. 

యశ్ రాజ్ సింగ్ గోహిల్ అనే వ్యక్తి గుజరాత్ నౌకాశ్రయంలో క్లాస్-1 ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య రాజేశ్వరి గోహిల్ తో సరదాగా, భయపెట్టేందుకు ఆడిన ఆట.. వాళ్ల నిండు జీవితాన్ని అంతం చేసింది. బుధవారం (జనవరి 22) రాత్రి వాళ్లకు ఈ భూమిమీద చివరి రోజుగా మిగిలిపోయింది. 

గన్ మిస్ ఫైర్ అవ్వడంతో యశ్ రాజ్ సింగ్ 108 ఎమర్జెన్సీ సర్వీస్ కు ఫోన్ చేశాడు. రాజేశ్వరి చనిపోయిందని సిబ్బంది చెప్పడంతో షాక్ లోకి వెళ్లిపోయాడు. మరో రూమ్ లోకి వెళ్లి అదే రివాల్వర్ తో షూట్ చేసుకుని స్పాట్ లోనే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 

గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ శక్తిసిన్హ గోహిల్ సోదరుడి కుమారుడు ఈ యశ్ రాజ్ సింగ్. ఈ ఘటనతో ఎంపీ శక్తిసిన్హ  కుటుంబం తీవ్ర దిగ్ర్భాంతిలోకి వెళ్లినట్లు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మనీష్ దోషి తెలిపాడు. 

ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చినట్లు తెలిపారు. బుధవారం రాత్రి భార్య భర్తలకు మధ్య వాగ్వాదం జరిగిందని.. ఆవేశంతో షూట్ చేసినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత భయంతో తను కూడా కాల్చుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి పంపించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.