గుజరాత్‭ను బీజేపీ ఒక మోడల్‭గా తీర్చిదిద్దింది : రివాబా జడేజా

గుజరాత్‭ను బీజేపీ ఒక మోడల్‭గా తీర్చిదిద్దింది : రివాబా జడేజా

గుజరాత్‭ను ఒక మోడల్‭గా తీర్చిదిద్దినది బీజేపీ ప్రభుత్వమేనని జామ్ నగర్ ఆ పార్టీ అభ్యర్థి రివాబా జడేజా అన్నారు. గత 27 ఏళ్లుగా గుజరాత్‭లో బీజేపీ పని చేస్తోందని చెప్పారు. కేవలం బీజేపీతోనే అభివృద్ధి పయనం సాగించాలని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. ఇక్కడి ప్రజలకు బీజేపీ ఎల్లప్పుడు సహకారం అందిస్తుందని చెప్పారు. 

తనకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన బీజేపీతో పాటు.. తనకోసం ప్రచారంలో పని చేసిన కార్యకర్తలకు.. తనకు ఓట్లు వారందరికీ రివాబా జడేజా ధన్యవాదాలు తెలిపారు. ఇది తన విజయం మాత్రమే కాదని.. ప్రజలందరి విజయం అంటూ సంతోషం వ్యక్తం చేశారు.