ఆధిక్యంలో రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా

ఆధిక్యంలో రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ తన రికార్డును తానే బ్రేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 150 కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. జామ్ నగర్ నార్త్ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రివాబా జడేజా ముందంజలో కొనసాగుతున్నారు. రివాబా 50శాతానికి పైగా ఓట్లతో అంటే 14,905ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బిపేంద్ర సింగ్, ఆప్ నుంచి అహిర్ కర్షన్ భాయ్ పర్బత్ బాయ్ కర్మూర్ లు పోటీ చేస్తున్నారు. 

గుజరాత్ లో 182 స్థానాలకు సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఒక విజయాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 20 లోపు స్థానాల్లో లీడింగ్ లో ఉండడంతో గతంలో కంటే ఈ సారి మరింత తక్కువ స్థాయికి కాంగ్రెస్ సక్సెట్ రేటు పడిపోనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆప్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.