గుజరాత్ వ్యాపారి బలుపు: జీతం అడిగితే బూట్లు నాకించి..బెల్ట్తో కొట్టింది

గుజరాత్ వ్యాపారి బలుపు: జీతం అడిగితే బూట్లు నాకించి..బెల్ట్తో కొట్టింది

జీతం ఇవ్వమని అడిగినందుకు ఓ సేల్ మేనేజర్పై దారుణంగా దాడి చేశారు ఓ కంపెనీ నిర్వాహకులు. పెండింగ్ జీతం కోసం ఫోన్ చేసి మేసేజ్ పంపినందుంకు ఉద్యోగం నుంచి తొలగించబడిన సేల్ మేనేజర్ ని బూట్లు నాకించింది ఓ వ్యాపారి. అంతేకాదు కిరాయి వ్యక్తులను పెట్టి బెల్ట్ తో విపరీతంగా కొట్టించింది. బాధితుడు వారి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే.. 

గుజరాత్ కు చెందిన సిరామిక్ కంపెనీ యజమాని మహిళా బిజినెస్ వుమెన్ అయిన విభూతి అలియాస్ రాణిబా పటేల్..  తన దగ్గర సేల్స్ మేనేజర్ గా పనిచేసిన ఓ వ్యక్తిని జీతం అడిగినందుకు తన అనుచరుల తీవ్రంగా కొట్టించడమే కాకుండా.. అమానవీయంగా తన బూట్లు నాకించింది.. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై పలు సెక్షన్లు, అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

విభూతి కంపెనీలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్న దల్సానియా.. కొద్దిరోజుల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అతనికి 18 రోజులు జీతం కంపెనీ నుంచిరావాల్సి ఉంది. తన పెండింగ్ శాలరీ చెల్లించాలని యజమాని అయిన విభూతికి ఫోన్ , మేసేజ్ చేయడమే అతను చేసిన నేరం.. అంతే విభూతికి కోపం  వచ్చింది.. ఒక సేల్స్ మేనేజర్ నాకు ఫోన్ చేసి జీతం అడుగుతాడా అని ఆగ్రహించిన విభూతి..శాలరీ ఇస్తాను కంపెనీకి రమ్మనిపిలిపించింది. 

ఆఫీసుకు వచ్చిన దల్సానియాపై తన అనుచురులతో  తీవ్రంగా దాడి చేయించింది. తన బూట్లు నాకించింది. అంతేకాదు.. క్షమాపణ చెప్పమని బంగ్లా టెర్రస్ పైకి తీసుకెళ్లి ఐదుగురు వ్యక్తులతో తీవ్రంగా కొట్టించింది.. దల్సానియాను కొడుతున్న సమయంలో వీడియో కూడా తీయించింది. తిరిగి తన కంట పడితే చంపేస్తానని దల్సానియాను విభూతి బెదిరించింది. దల్సానియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.. విభూతిపై పోలీసులు కేసు చేశారు. ప్రస్తుతం దల్సానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.