IPL 2026 Final: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ రసవత్తరంగా కొనసాగుతోంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫీల్డింగ్ తీసుకోగా.. మొదట బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ టైటాన్స్ (GT)పై ఆర్సీబీ బౌలర్లు మ్యాచ్ స్టార్టింగ్ నుంచే నిప్పులు చెరిగారు. గుజరాత్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూ కడుతున్న వేళ.. వాషింగ్టన్ సుందర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలంటే ఇప్పుడు ఆర్సీబీ ముందు 156 పరుగుల ఈజీ టార్గెట్ ఉంది.
గిల్, సుదర్శన్ ఔట్‌తో మొదలైన తిప్పలు:
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్‌ను సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ కాస్త దూకుడుగానే మొదలు పెట్టారు. ఫస్ట్ ఓవర్లోనే 13 పరుగులు పిండుకుని మంచి ఊపుమీద కనిపించిన ఈ జీటీ ఓపెనర్ల జోడీని ఆర్సీబీ ఎక్కువ సేపు క్రీజులో ఉంచలేదు.. జట్టు స్కోరు 22 పరుగుల దగ్గర ఉన్నప్పుడు ఆర్సీబీ స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ వేసిన బంతికి బెంగళూరు సారథి రజత్ పటిదార్‌కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అవుట్ అయ్యాడు. గిల్ అవుట్‌తో ఒత్తిడిలోకి వెళ్లిన గుజరాత్‌కు కోలుకునే టైం ఇవ్వకుండా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్‌ను భువనేశ్వర్ కుమార్ దెబ్బకొట్టాడు. భువి బౌలింగ్‌లో వికెట్ కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి సుదర్శన్ మైదానం వీడటంతో గుజరాత్ కష్టాలు షురూ అయ్యాయి.
బట్లర్ స్టంపౌట్.. అర్షద్ ఖాన్ మెరుపులు:
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నిశాంత్ సింధు, జోస్ బట్లర్ కాసేపు వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారుతున్న నిశాంత్ (20)ను రసీఖ్ సలామ్ దార్ బౌలింగ్‌లో దేవదత్ పడిక్కల్ క్యాచ్ పట్టి పంపించేశాడు. ఆ కాసేపటికే స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ కూడా కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో స్టంపౌట్ కావడంతో గుజరాత్ బిగ్ ట్రబుల్‌లో పడింది. ఈ దశలో ఫిఫ్త్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అర్షద్ ఖాన్ కాసేపు చెలరేగి ఆడాడు. జాకబ్ డఫీ వేసిన ఓ ఓవర్లో 4, 4, 1, 6, 1, 0తో ఏకంగా 16 రన్స్ కొట్టిన అర్షద్.. ఆ తర్వాత జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అవుటై డగౌట్‌కు చేరాడు. అనంతరం వచ్చిన రాహుల్ తెవాటియా మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 7 రన్స్ మాత్రమే చేసి రసీఖ్ సలామ్ దార్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. హేజిల్ వుడి బౌలింగ్ లో డగౌట్ కి వెళ్లిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 7 రన్స్ మాత్రమే చేసి రసిఖ్ దార్ సలామ్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు.
►ALSO READ | ఆర్సీబీ సరికొత్త రికార్డు.. చెన్నై సూపర్ కింగ్స్ ఐదేళ్ల హిస్టరీకి బ్రేక్
వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం:
చివర్లో వచ్చిన జేసన్ హోల్డర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 7 పరుగులే చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో హేజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రషీద్ ఖాన్ ఓ భారీ సిక్స్ కొట్టినప్పటికీ, ఆ మరుసటి బంతికే రసీఖ్ సలామ్ దార్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో మొండిగా నిలబడిన వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో రచ్చ లేపాడు. సుందర్ ఆదుకోవడంతోనే గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులైనా చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో రసీఖ్ సలామ్ దార్ 3 వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ తమ స్పెల్స్‌తో గుజరాత్‌ను ఊపిరాడకుండా చేశారు.
