
ఐపీఎల్ 2025 లో గుజరాత్ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఆదివారం (మే 19) ఢిల్లీ క్యాపిటల్స్ పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రాయల్ గా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. మొదట గుజరాత్ బౌలింగ్ లో విఫలమైనా.. ఛేజింగ్ లో ఓపెనర్లు సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108:12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు), కెప్టెన్ శుభమాన్ గిల్ (53 బంతుల్లో 93:3 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగడంతో కొండంత లక్ష్యాన్ని కూడా సునాయాసంగా ఛేజ్ చేసింది.
ఈ విజయంతో గుజరాత్ తో పాటు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 19 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 205 పరుగులు చేసి గెలిచింది.
ALSO READ | T20ల్లో చరిత్ర సృష్టించిన KL రాహుల్.. విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఓపెనర్లు సునాయాసంగా విజయాన్ని అందించడం విశేషం. ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్నసాయి సుదర్శన్, శుభమాన్ గిల్ వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేజ్ చేయడం విశేషం. వీరిద్దరూ పవర్ ప్లే లో ధాటిగా ఆడడంతో 6 ఓవర్లలో గుజరాత్ వికెట్ కోల్పోకుండా 59 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత వీరిద్దరూ జోరు పెంచడంతో స్కోర్ శరవేగంగా ముందుకు వెళ్ళింది. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇన్నింగ్స్ మొత్తం అదే జోరును కొనసాగించి వికెట్ కోల్పోకుండా ఛేజ్ విశేషం.
సాయి సుదర్శన్ 56 బంతుల్లో సెంచరీ చేసుకోగా.. గిల్ 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రాహుల్ (65 బంతుల్లో 112*:14 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో పాటు అభిషేక్ పోరెల్ (30), కెప్టెన్ అక్షర్ పటేల్ (25) కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్, అర్షద్ ఖాన్, ప్రసిద్ కృష్ణలకు తలో వికెట్ దక్కింది.
History Win For Gujarat Titans, They Beat Delhi Capitals By 10 Wickets.#DCvsGT pic.twitter.com/niJ9gQl65K
— Cricket Clue (@cricketclue247) May 18, 2025