IPL 2023: హై ఓల్టేజ్ మ్యాచ్..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

IPL 2023:  హై ఓల్టేజ్ మ్యాచ్..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

ఐపీఎల్ 2023 మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.  గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోగా..చెన్నై సూపర్ కింగ్స్‌ పై గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఈ నేపథ్యంలో రెండో విజయంపై గుజరాత్ కన్నేయగా...బోణి కొట్టాలని ఢిల్లీ ప్రణాళికతో బరిలోకి దిగింది. 

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు: శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యష్ దయాళ్


ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్,  సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), రిలీ రొస్సో, అభిషేక్ పోరెల్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రీచ్ నోర్ట్జే