DC vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్.. ప్లేయింగ్ 11లో రబడా, ముస్తాఫిజుర్

DC vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్.. ప్లేయింగ్ 11లో రబడా, ముస్తాఫిజుర్

ఐపీఎల్ 2025 లో ఆదివారం (మే18) మరో ఆసక్తికర సమరం అభిమానులని అలరించనుంది. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈ మ్యాచ్ లో విజయం అత్యంత కీలకం.        

ALSO READ | Virat Kohli: ఇంగ్లాండ్ కౌంటీల్లో కోహ్లీ..? విలియమ్సన్‌‌ జట్టులో కింగ్

ఢిల్లీ  ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది.  మాధవ్ తివారీ స్థానంలో విప్రజ్ నిగమ్, స్టార్క్ స్థానంలో ముస్తాఫిజుర్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించారు. మరోవైపు గుజరాత్ జట్టులో రబడా తుది జట్టులోకి వచ్చాడు. 
    
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

 ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వీ, KL రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్, ముస్తాఫిజుర్ రెహమాన్