Virat Kohli: ఇంగ్లాండ్ కౌంటీల్లో కోహ్లీ..? విలియమ్సన్‌‌ జట్టులో కింగ్

Virat Kohli: ఇంగ్లాండ్ కౌంటీల్లో కోహ్లీ..? విలియమ్సన్‌‌ జట్టులో కింగ్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి ప్రపంచ క్రికెట్ ను షాకింగ్ కు గురి చేశాడు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఇంగ్లాండ్ కౌంటీల్లో కనిపించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ కౌంటీ జట్టు మిడిలెసెక్స్ విరాట్ తో  ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు ధృవీకరించింది. మే 12న కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని అద్భుతమైన టెస్ట్ కెరీర్‌కు తెరపడింది. 36 ఏళ్ల కోహ్లీ ఇండియా తరపున 123 టెస్టులు ఆడి 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలతో సహా 9230 పరుగులు చేశాడు.

మే 12న కోహ్లీ భారత టెస్ట్ జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కానీ అతని ఫస్ట్-క్లాస్ కెరీర్ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మిడిల్‌సెక్స్ క్రికెట్ డైరెక్టర్ అలాన్ కోల్‌మన్ గార్డియన్‌ మిడిలెసెక్స్ తరపున కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం గురించి కోహ్లీతో చర్చలు ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తన ఆసక్తిని తెలిపాడు. 2018లో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ సర్రే తరఫున సంతకం చేసినా మెడ గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఒకవేళ కోహ్లీ మిడిలెసెక్స్ తరపున ఆడదానికి అంగీకరిస్తే విలియంసన్ తో పాటు ఒకే జట్టులో చూడొచ్చు.  

ALSO READ | కోహ్లీని కన్విన్స్ చేయడానికి ట్రై చేశా.. కానీ: విరాట్ రిటైర్మెంట్‎పై సంజయ్ బంగర్ రియాక్షన్

భారత క్రికెట్ నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న క్రికెటర్లు విదేశీ లీగ్‌లలో పాల్గొనడానికి వీలు లేదు. అయితే ఆ ఫార్మాట్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత వారు ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్, ఫస్ట్-క్లాస్ (కౌంటీ ఛాంపియన్‌షిప్), లిస్ట్ ఏ (మెట్రో బ్యాంక్ వన్డే కప్) టోర్నీల్లో ఆడటానికి అనుమతి ఉంది. ఇటీవలే టెస్ట్‌ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ఇంగ్లాండ్ కౌంటీ ఆడేందుకు ఆసక్తి చూపిస్తాడో లేదో చూడాలి. 

అద్భుతమైన ఫిట్ నెస్ ఉన్న 36 ఏళ్ళ కోహ్లీకి మరో మూడు నుంచి నాలుగేళ్లు ఈజీగా టెస్ట్ క్రికెట్ ఆడతారని భావించారు. కోహ్లీ మాత్రం అందరికీ ఊహించని షాకిస్తూ త్వరగానే టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్.. ఇకపై వన్డేల్లో మాత్రమే కనిపించనున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్న కోహ్లీ.. ఈ సీజన్ లో 505 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచాడు.