
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం ప్రత్యేక వంటకాలు సిద్ధమవుతున్నాయి. గుజరాతీ ఫేమస్ వంటకాలను చెఫ్ సురేశ్ ఖన్నాటీమ్ ప్రిపేర్ చేస్తోంది. స్పెషల్ లడ్డూతో పాటు చాలా రకాలు స్వీట్లు , గుజరాతీ వెజ్ వంటకాలు ఎక్కువగా రెడీ చేస్తున్నారు. ఖమాన్ మరియు మల్టీగ్రెయిన్ రోటీస్ కూడా ట్రంప్ మెనూలో ఉన్నాయి. అమెరికా అధికారులు, ఫుడ్ ఇన్సిపెక్టర్లు టేస్ట్ చేశాకే వీటిని వడ్డించనున్నారు. ట్రంప్ కు వంటకాలు చేసే అవకాశం రావడం గర్వంగా ఉందంటున్నారు చెఫ్ సురేశ్ ఖన్నా. గుజరాతీ రుచులను అమెరికా అగ్రనేతలకు అందిస్తామని చెప్పారు.