
ఈ సీజన్ ఐపీలో అదరగొడుతున్న గుజరాత్ టైటాన్స్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది పంజాబ్. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ 48 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 65 పరుగులు నాటౌట్ రాణించడంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరు సాధించింది. సుదర్శన్ మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. సాహా 21 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ 4 వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ సింగ్, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టన్ తలో వికెట్ తీసుకున్నారు.
తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు, కేవలం ఒక్క ఓటమితో ఎదురులేకుండా దూసుకెళ్తున్న గుజరాత్‌కు పంజాబ్ కింగ్స్ బ్రేక్ వేస్తుందా.? ఈ సీజన్‌లో 2 జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరి పంజాబ్ గుజరాత్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేక తలొగ్గుతుందా అనేది సెకండ్ ఇన్నింగ్స్ లో తేలుతుంది.
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 3, 2022
Excellent bowling by #PBKS as they restrict #GujaratTitans to a total of 143/8 on the board.
Scorecard - https://t.co/LcfJL3mlUQ #GTvPBKS #TATAIPL pic.twitter.com/8xyTfsftux