మళ్లీ టాప్‌‌‌‌‌‌‌‌లోకి గుకేశ్

మళ్లీ టాప్‌‌‌‌‌‌‌‌లోకి గుకేశ్

టొరాంటో: క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ చెస్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్‌‌‌‌‌‌‌‌ తిరిగి టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్‌‌‌‌‌‌‌‌లో అతను ఇండియాకే చెందిన విదిత్‌‌‌‌‌‌‌‌ సంతోష్ గుజరాతీని ఓడించాడు. దాంతో ఇయాన్ నెపోమ్నియాచితో కలిసి జాయింట్‌‌‌‌‌‌‌‌గా టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నాడు. ఇదే రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఫిరౌజా అలీరెజాతో డ్రా చేసుకున్నాడు. మరో ఆరు రౌండ్లు మిగిలున్న టోర్నీలో గుకేశ్‌‌‌‌‌‌‌‌, ఇయాన్‌‌‌‌‌‌‌‌ ఐదేసి పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌లో ఉండగా, ప్రజ్ఞానంద 4.5 పాయింట్లు, విదిత్ 3.5 పాయింట్లతో నిలిచారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌లో కోనేరు హంపి ఇండియాకే చెందిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. వైశాలిపై గెలిచి 3.5 పాయింట్లతో ఐదో స్థానంలోకి వచ్చింది.