నదుల్లో ప్రవహిస్తున్న శవాలు కనిపించట్లేదా?

నదుల్లో ప్రవహిస్తున్న శవాలు కనిపించట్లేదా?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. కేంద్ర ప్రభుత్వ అలసత్వం వల్లే దేశంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోందని మండిపడ్డారు. కరోనా బారిన పడి చనిపోయిన వారి శవాలు కనిపించడం లేదా అంటూ మోడీని ప్రశ్నించారు. 
'నదుల్లో ప్రవహిస్తున్నాయి లెక్కలేనన్ని శవాలు. ఆస్పత్రుల బయట మైళ్ల కొద్దీ లైన్లు.. సురక్షితంగా జీవించే హక్కును కూడా గుంజుకున్నారు. ఇప్పటికైనా ఆ గులాబీ రంగు కళ్లజోళ్లను తీయండి ప్రధాన మంత్రి. మీకు ఆ సెంట్రల్ విస్టా భవనం తప్ప మరేదీ కనిపించదు కదా' అని రాహుల్ సెటైరికల్ గా ట్వీట్ చేశారు.