V6 News

గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలి : అధ్యక్షుడు కల్లెడ భూమయ్య

గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలి : అధ్యక్షుడు కల్లెడ భూమయ్య

జన్నారం, వెలుగు: గల్ఫ్​కార్మికుల సంక్షేమం కోసం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హమీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమయ్య డిమాండ్​చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో మంగళవారం అంతర్జాతీయ గల్ఫ్ కార్మికులు స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత వివిధ కారణాలతో 1900 మంది గల్ఫ్ కార్మికులు మరణించారని, వారి కుటుంబాలను అదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం పరిష్కరించలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా గల్ఫ్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు సేపురి గోపాల్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎ.తిరుపతి గౌడ్, పి.మల్లిఖార్జున్, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తిరుపతి, మండల శాఖ ప్రెసిడెంట్ ఎం.తిరుపతి, జనరల్ సెక్రటరీ ది.ఎల్లయ్య తదతరులు పాల్గొన్నారు.