బైక్ మీద వచ్చి మేయర్‌పై కాల్పులు

బైక్ మీద వచ్చి మేయర్‌పై కాల్పులు

నాగ్‌పూర్ మేయర్ సందీప్ జోషిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మేయర్ సందీప్ తన 24వ పెళ్లిరోజు సందర్బంగా కొంత మంది స్నేహితులు మరియు అనుచరులతో కలిసి ఔటర్ రింగ్ రోడ్డులోని ఓ దాబాకు వెళ్లారు. అక్కడ విందు అయిపోయిన తర్వాత తన ఫార్చునర్ వాహానాన్ని స్వయంగా సందీప్ నడుపుకుంటూ వస్తున్నాడు. ఆయనతో పాటూ కారులో ఆదిత్య ఠాకూర్ ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు వార్థా రోడ్డు జంక్షన్ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన అగంతకులు మేయర్ వాహనంపై కాల్పలు జరిపారు. అందులో ఒక బుల్లెట్ మేయర్ పక్క విండోకు తగలగా, మరోకటి ఆయన వెనుక సీటు విండోకు తగిలింది. మరో బుల్లెట్ వాహనం వెనుకవైపు తగిలింది. ఈ కాల్పుల్లో ఎవరికి గాయాలుకాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే మేయర్ పోలీసులకు సమాచారమిచ్చి కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.