శామీర్పేట్ సెలబ్రిటీ క్లబ్ లో యువకుడి కాల్పులు

శామీర్పేట్ సెలబ్రిటీ క్లబ్ లో యువకుడి కాల్పులు

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సెలబ్రిటీ రిసార్ట్ లో కాల్పుల కలకలం  సృష్టించాయి. సిద్ధార్ధ్‌ దాస్‌ అనే వ్యక్తిపై మనోజ్ కుమార్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సిద్ధార్థ్  కు గాయాలయ్యాయి.  కాల్పుల నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్  శామీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. సిద్ధార్థ్ భార్యతో మనోజ్ కుమార్ కు  వివాహేతర సంబంధం కారణంగానే కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. మనోజ్ కుమార్  క్లబ్ లోకి ఎయిర్ గన్ తీసుకెళ్లాడని చెప్పారు.  ఎయిర్ గన్ తో కాల్పులు జరపడంతో సిద్ధార్థ్ కు  గన్ లోని పిల్లెట్ తగలి  గాయాలయ్యాయని తెలిపారు.