ఆదిలాబాద్ జిల్లాలో కలకలం .. ఎస్ బీఐ బ్యాంకులో గన్ మిస్ ఫైర్

ఆదిలాబాద్ జిల్లాలో కలకలం .. ఎస్ బీఐ బ్యాంకులో  గన్ మిస్ ఫైర్
  • ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో  కలకలం రేపిన ఘటన
  • ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం

ఆదిలాబాద్, వెలుగు : బ్యాంకు సెక్యూరిటీ గార్డు గన్ మిస్ ఫైర్ కావడం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం శివాజీ చౌక్ లోని ఎస్ బీఐ బ్రాంచ్ లో సెక్యురిటీ గార్డు రాములు తన గన్ లో తూటాలు లోడ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా గన్ పేలడంతో తూటా బయటకు వచ్చింది. తూటా పైన శ్లాబ్ కు తగలడంతో ఆ సమయంలో బ్యాంకులో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.