
హైదరాబాద్ లో మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధితో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో SPF కానిస్టేబుల్ చనిపోయాడు. మృతుడు సూర్యాపేట జిల్లా బత్తులపాలెంకు చెందిన మధుగా గుర్తించారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మధు మెట్లు మీద నడుచుకుంటూ వెళ్తున్న టైంలో గన్ మిస్ ఫైర్ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.