
లేడీస్ హాస్టల్స్ విషయంలో ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. ఎంతమంది అధికారులు తనిఖీ చేస్తున్నా నిత్యం ఎక్కడొక చోట సీసీ కెమెరాల విషయంలో గందరగోళం వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ హాస్టల్లో సీక్రెట్ సీసీ కెమెరాలు కలకలం రేపాయి. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...
గుంటూరు జిల్లా బ్రాడీపేట లోని శ్రీనివాస లేడీస్ హాస్టల్ లో బాత్రూం ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నా రంటూ విద్యార్థినులు పోలీసులకు ఈరోజు ( మే 4) ఫిర్యాదు చేశారు... అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్ లు పెట్టడం... అబ్బాయిల్ని తీసుకుని వచ్చి లేడీస్ హాస్టల్ లో ఉంచడం చేస్తున్నారని హాస్టల్ లో ఉంటున్న విద్యార్థినులు చెబుతున్నారు. విధ్యార్థినుల కంప్లయిట్ పై కేసు నమోదు చేసిన అరండల్ పేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హాస్టల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.