గుంటూరు కారం ఫస్ట్ డే 3 వేల షోలు.. 12 లక్షల టికెట్లు

గుంటూరు కారం ఫస్ట్ డే 3 వేల షోలు.. 12 లక్షల టికెట్లు

ప్రిన్స్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ ధియేటర్లలో సందడి చేయటానికి రెడీగా ఉంది.. ఫ్యాన్స్ మాత్రం టికెట్ల బుకింగ్స్ లో బిజీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో షోలు, టికెట్ల అమ్మకాలు జరగటం.. మహేష్ బాబు సినీ కెరీర్ లోనే ఓ రికార్డ్.. జనవరి 12వ తేదీ మూవీ ధియేటర్లలోకి వస్తుండటం.. అర్థరాత్రి ఒంటి గంట నుంచే షోలు పడనున్నాయి..

తెలుగు రాష్ట్రాల్లో 12వ తేదీ ఫస్ట్ డే.. ఏకంగా 3 వేల షోలు పడుతున్నాయి.. అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 13 వందల షోలు పడుతుండగా.. వైజాగ్ లో 257 షోలు, విజయవాడలో 176 షోలు, గుంటూరులో 125 షోలు, వరంగల్ లో 70 షోలు, ఖమ్మంలో 25 షోలు, కాకినాడలో 47 షోలు, తిరుపతిలో 56 షోలు, నెల్లూరులో 68 షోలు వేస్తున్నారు. ఇక బెంగళూరులో అయితే ఏకంగా 538 షోలో పడుతున్నాయి.

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే గుంటూరు కారం మూవీ ఫస్ట్ డే.. 12 లక్షల మంది సినిమా చూడనున్నారు.. అంటే 12 లక్షల టికెట్ల అమ్మకం జరుగుతుంది. కేవలం టికెట్ల అమ్మకం ద్వారా.. మొదటి రోజే 26 కోట్ల రూపాయలు రానున్నాయి. తెలుగు సినీ హిస్టరీలో ఇది ఓ రికార్డ్ అంటున్నారు సినీ విశ్లేషకులు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ధియేటర్ లో.. ప్రతి స్కీన్ పై గుంటూరు కారం పడుతుంది. అన్ని ధియేటర్లలో ఇదే సినిమా ఉండటంతో టికెట్లు ఈజీగానే దొరుకుతున్నాయి. హైదరాబాద్ మల్టీఫ్లెక్సుల్లోని అన్ని స్క్రీన్స్ పై.. అర్థరాత్రి ఒంటి గంట నుంచే షోలు వేస్తుండటంతో.. టికెట్లు ఈజీగానే దొరుకుతున్నాయి. ఓవరాల్ గా గుంటూరు కారం సినిమాను.. ఫస్ట్ డే.. తెలుగు రాష్ట్రాల్లో 12 లక్షల మంది చూడబోతున్నారు.. టాక్ ఎలా ఉన్నా.. ఇది మాత్రం ఓ రికార్డ్..