అమెరికాలో 5408కి పైగా ప్రీమియర్ షోలు

అమెరికాలో 5408కి పైగా ప్రీమియర్ షోలు

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా .. జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున ఈ మూవీపై  భారీ అంచనాలు ఉన్నాయి. కాగా అమెరికాలో 5408కి పైగా గుంటూరు కారం ప్రీమియర్ షోలు వేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు. 

ఆర్ఆర్ఆర్-3800కి పైగా, సలార్-2450కి పైగా ప్రీమియర్  షోలు వేశారు. అయితే ఈ రెండు పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే.. తెలుగు మూవీకి ఈ రేంజు ప్రీమియర్ షోలు అంటే సరికొత్త రికార్డే. దీంతో 'గుంటూరు కారం సినిమాకు లాంగ్ రన్ లో 5-6 మిలియన్ డాలర్స్ వసూళ్లు రావడం గ్యారంటీ అనిపిస్తోంది.