
మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘గుంటూరు కారం’. శ్రీలీల హీరోయిన్. త్రివిక్రమ్ దర్శకుడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించిన మేకర్స్.. ఆ లక్ష్యాన్ని చేరుకునేలా శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. మరోవైపు ప్రమోషన్‌లోనూ వేగం పెంచుతూ ఇప్పటికే రెండు పాటలను విడుదల చేశారు.
తాజాగా మరో పాటకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు. హై ఓల్టేజ్ స్పైసీ మాస్ సాంగ్ షూటింగ్ జరుగుతోందంటూ ఓ ఫొటోను రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ బాబు, శ్రీలీల జంట మాస్ గెటప్స్‌లో కనిపిస్తున్నారు. థియేటర్స్‌లో ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా తమన్ ఈ మాస్ సాంగ్‌ను కంపోజ్ చేసినట్టు మేకర్స్ చెబుతున్నారు. ఇక నెలాఖరులో పాటను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ షూటింగ్‌తో చిత్రీకరణ పూర్తవనుంది. జనవరి ఫస్ట్ వీకెండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదల కానుంది.