గుంటూరులో 99 అడుగుల మహా గణపతి.. 16 టన్నుల గంగా మట్టితో విగ్రహం తయారీ

గుంటూరులో 99 అడుగుల మహా గణపతి.. 16 టన్నుల గంగా మట్టితో విగ్రహం తయారీ

గుంటూరులో ఏర్పాటు చేసిన 99 అడుగుల మహా మట్టి గణపతి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. గంగా నది తీరం నుంచి తీసుకొచ్చిన 16 టన్నుల పవిత్రమైన మట్టిని ఈ విగ్రహం తయారీలో వినియోగించినట్టు నిర్వాహకులు తెలిపారు. 150 మంది కార్మికులు మూడు నెలలు కష్టపడి ఆ గణపతి ప్రతిమను రూపొందించినట్టు చెప్పారు.

గుంటూరులో ఏర్పాటు చేసిన 99 అడుగుల మహా మట్టి గణపతి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆధ్యాత్మిక దృశ్యానికి గుంటూరు సిద్ధమైంది ది. వినాయక చవితి (ఆగస్టు 27) నాడు, దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన పర్యావరణ అనుకూల గణపతి అయిన 99 అడుగుల మట్టి గణపతి విగ్రహం ఆవిష్కృతమయింది. ఉత్తరప్రదేశ్‌లోని గంగా నది ఒడ్డున నుండి తెచ్చిన16 టన్నుల పవిత్రమైన బంకమట్టితో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. 150 మంది కార్మికులు మూడు నెలలు కష్టపడి ఆ గణపతి ప్రతిమను రూపొందించినట్టు నిర్వాహకులు తెలిపారు. 

ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను  వ్యతిరేకిస్తూ..  పర్యావరణ అనుకూల మహా త్రిముఖ నాగ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ  ఈవిగ్రహాన్ని స్థాపించింది. వినాయక చవితి రోజు  మట్టి విగ్రహానికి పూజలు చేయడం  భక్తి  మాత్రమే కాదని.. , పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాల ఆరాధన ఒక సందేశమని కమిటి చైర్మన్​ ఎం. నరేందర్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ ...  బెంగళూరు నుంచి  150 మంది కళాకారులు 21 రోజుల పాటు 24 గంటలూ పనిచేసి  ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఇక్కడ  ఈ ఉత్సవాలు 21 రోజుల పాటు పూజలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. నిత్యం గణపతి హోమం  జరుగుతుంది.  ఈ విగ్రహాన్ని  నదులు.. చెరువుల్లో కాకుండా.. నీటి వనరులను కలుషితం చేయకుండా   ఒక ఖాళీ ప్రదేశంలో.. ఫైరింజన్ల సాయంతో  నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. 

ఈ విగ్రహాన్ని దర్శించేందుకు లక్షలాది మంఇ భక్తులు తరలి రావడంతో 24 గంటలు పోలీస్​ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీఐపీ దర్శనం కూడా ఏర్పాటు చేశారు.  వాహనాల పార్కింగ్​ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.  గుంటూరులో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాన్ని దర్శించేందుకు 30 లక్షల నుంచి 50 లక్షల మంది వరకు భక్తులు వస్తారని కమిటి అంచనా వేస్తోంది.