ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేసే గుర్రం పాపిరెడ్డి

ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేసే గుర్రం పాపిరెడ్డి

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన  సినిమా  ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో  వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డిసెంబర్ 19న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. జడ్జి జి.వైద్యనాథన్(బ్రహ్మానందం) తెలివితక్కువ వాళ్లతో వ్యవహరించడంలో అనుభవజ్ఞుడు. 

అలాంటి ఆయన దగ్గరకు ఓ విచిత్రమైన కేసు హియరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య), సౌధామిని (ఫరియా అబ్దుల్లా), మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోస్గి) కలిసి శ్రీశైలం అడవుల్లో సమాధి చేసిన ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్తారు. 

అక్కడికి మరికొందరు గ్రేవ్ రాబర్స్ కూడా పోటీకి వస్తారు. ఆ దొంగలతో ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రీశైలం అడవుల్లో పాతిపెట్టిన ఆ శవం ఎవరిది, దాని కోసం హీరో గ్యాంగ్ తో పాటు మరికొన్ని గ్యాంగ్స్ ఎందుకు వేట సాగిస్తున్నాయి. ఈ వేట కథను ఉడ్రాజు (యోగిబాబు) ఎలా మలుపుతిప్పాడు. 1927 నుంచి 1987 వరకు జీవించిన కలింగ పోతురాజు ఎవరు, శ్రీ మార్కండేయ రాజుతో ఈ కథకున్న లింకు ఏంటి అనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది.