డిసెంబర్ 9న గుర్తుండిపోయే శీతాకాలం

డిసెంబర్ 9న గుర్తుండిపోయే శీతాకాలం

సత్యదేవ్, తమన్నా, జంటగా నటించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్ దర్శకుడు. కన్నడలో సూపర్ హిట్టైన ‘లవ్ మాక్‌‌‌‌‌‌‌‌టెయిల్‌‌‌‌‌‌‌‌’కి ఇది రీమేక్. చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ కలిసి నిర్మించిన ఈ సినిమాని డిసెంబర్ 9న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో సత్యదేవ్ మాట్లాడుతూ ‘కామెడీ, లవ్ స్టోరీస్ చేయాలనుకుంటున్న నాకు.. నాగశేఖర్ ఈ స్టోరీ చెప్పగానే పది నిమిషాల్లో ఓకే చెప్పా. హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా తమన్నా అనగానే వావ్ అనిపించింది. అందుకే ఇందులో తమన్నాని చూసే సీన్‌‌‌‌‌‌‌‌లో ‘ఇది మన రేంజ్ కాదేమోరా’ అనే డైలాగ్ పెట్టాం.  

మూడు ప్రేమ కథలను కలిపిన చిత్రమే ‘గుర్తుందా శీతాకాలం’. నిధి పాత్రలో గతంలో ఎప్పుడూ  చేయని క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమన్నా కనిపించనుంది. కావ్య శెట్టి, మేఘ ఆకాష్  చాలా అందంగా న‌‌‌‌‌‌‌‌టించారు. యూత్‌‌‌‌‌‌‌‌కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి’ అన్నాడు. ఇందులోని  ల‌‌‌‌‌‌‌‌వ్ స్టోరీస్ ప్రేక్షకుల హ‌‌‌‌‌‌‌‌ర్ట్‌‌‌‌‌‌‌‌ని ట‌‌‌‌‌‌‌‌చ్ చేసేలా ఉంటాయన్నాడు దర్శకుడు నాగశేఖర్. ఈ ‘శీతాకాలం’ ప్రేక్షకుల గుండెల్లో గుర్తుండిపోతుందన్నారు నిర్మాత రామారావు.  చిత్ర సమర్పకుడు ఎం.సుబ్బారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నవీన్ రెడ్డి, ప్రియదర్శి పాల్గొన్నారు.