టీజీటీ ఫలితాలు విడుదల .. 27, 28న సర్టిఫికెట్ వెరిఫికేషన్​

టీజీటీ ఫలితాలు విడుదల .. 27, 28న సర్టిఫికెట్ వెరిఫికేషన్​

హైదరాబాద్, వెలుగు: గురుకుల ట్రైన్డ్​ గ్రాడ్యుయేట్​టీచర్​ (టీజీటీ) ఫలితాలను గురుకుల రిక్రూట్​మెంట్​బోర్డు ఆదివారం విడుదల చేసింది. 27, 28వ తేదీల్లో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్​ చేయనుంది. గురుకులాల్లో 4,020 పోస్టులకు గత ఏడాది ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలో మెరిట్​ సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్​ వెరిఫికేషన్​కు ఎంపిక చేసింది.

ఈ మేరకు ప్రొవిజనల్ ​సెలక్షన్ ​జాబితాలను విడుదల చేసింది. ఈ నెల 27న ఇంగ్లిష్ ​సబ్జెక్టు అభ్యర్థులకు బంజారా భవన్​లో, జనరల్​సైన్స్​అభ్యర్థులకు ఆదివాసీ కుమ్రం భీమ్​ భవన్​లో, తెలుగు, సోషల్​ స్టడీస్​ అభ్యర్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో, ఈ నెల 28న మ్యాథ్స్​అభ్యర్థులకు బంజారా భవన్ లో, హిందీ, సంస్కృతం, ఉర్దూ అభ్యర్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో, ఫిజికల్​సైన్స్ అభ్యర్థులకు ఆదివాసీ కుమ్రం భీమ్​ భవన్​లో సర్టిఫికెట్ ​వెరిఫికేషన్​ చేయనున్నారు.