దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా కేంద్ర విధానాలు

దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా కేంద్ర విధానాలు

దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా కేంద్రం విధానాలు ఉన్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఆయన ఇవాళ నల్గొండలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనులు బాగున్నాయని పార్లమెంట్ లో కితాబు ఇచ్చినా రాష్ట్రంలో 16 బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. కొర్రీలను పెడుతూ తెలంగాణలో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

మోడీ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు బతకడం కష్టంగా మారిందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. స్మశానవాటికలకు సైతం జీఎస్టీ పెడుతున్నారు, జీఎస్టీని ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేశారు. గతంలో కంటే ఎక్కువగా 100 లక్షల కోట్లు కేంద్రం అప్పు చేసినా రాష్ట్రంలో ఒక్క జాతీయ ప్రాజెక్టును ఇవ్వలేదన్నారు. సీబీఐ, ఈడీలతో బెదిరింపులకు గురి చేస్తూ బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు.