
హైదరాబాద్, వెలుగు: తహసీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఇది అమానుషమైన చర్యని, ఈ ఘటన తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. అధికారులపై భౌతిక దాడులకు దిగడం దుర్మార్గమన్నారు. నిందితుడు సురేశ్‌ను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలవల్ల వారితో పాటు ఇతరులకూ హాని జరుగుతుందనే విషయం తెలుసుకోవాలన్నారు. విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో గాయాల పాలై మృతి చెందిన డ్రైవర్ గంగాధర్ మృతి పట్ల గుత్తా తీవ్ర సంతాపం తెలిపారు.