బెంగళూరులో జెప్టో డెలివరీ బాయ్‌పై దాడి, హెల్మెట్‌తో గుండెపై కొట్టి...

బెంగళూరులో జెప్టో డెలివరీ బాయ్‌పై దాడి, హెల్మెట్‌తో  గుండెపై కొట్టి...

బెంగళూరులోని మహదేవపుర ప్రాంతంలో ఒక చిన్న రోడ్డు ప్రమాదం పెద్ద గొడవకు దారితీసింది. దింతో అక్కడ  పక్కన ఉన్న సామాన్యులు, వాహనదారులు షాక్‌కు గురైయ్యారు. 

ఎం  జరిగిందంటే :
ఓ జెప్టో (Zepto) డెలివరీ బాయ్ తన పని మీద  తను వెళ్తుండగా స్కూటీ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు అతని బైక్ ని ఢీకొట్టారు. ఇది చాలా చిన్న ప్రమాదమే అయిన.... ఆ స్కూటీ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు విచక్షణ కోల్పోయి డెలివరీ బాయ్‌పై దాడి చేస్తూ  రోడ్డుపై పడేసి మరి  కొట్టారు. అంతటితో ఆగకుండా హెల్మెట్‌తో అతని ఛాతీపై బలంగా కొట్టారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక డెలివరీ బాయ్ రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. 

►ALSO READ | మేం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం : తగ్గేదేలా అంటున్న ఇరాన్

 అక్కడ ఉన్నవారు చూస్తుండగానే ఈ దాడి జరుగుతుండగా, ఒక వృద్ధుడు ధైర్యంగా ముందుకు వచ్చి ఆ ఇద్దరినీ అడ్డుకోగా దాడి ఆగింది... వేంటనే వాళ్లిద్దరూ అక్కడి నుండి పారిపోయారు.  ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో . దీనిపై స్పందించిన వైట్‌ఫీల్డ్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.