
రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి. MLC ఎన్నికల్లో TRSపార్టీ అభ్యర్థిగా గుత్తాను సీఎం కేసీఆర్ ఫైనల్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తనను MLC అభ్యర్థి గా ప్రకటించినందుకు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు గుత్తా. కాంగ్రెస్ తరపున అభ్యర్థులెవరూ నామినేషన్ వేసే అవకాశం లేకపోవడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికవనున్నట్లు తెలుస్తుంది.