మహబూబ్‌నగర్ అర్బన్/చిన్నచింతకుంట, వెలుగు: రైతులు పాడి పరిశ్రమపై దృష్టి పెట్టాలని రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ఉదయం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన ప్రభుత్వ విప్, పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని క్యాంపు ఆఫీసులో కలిసి సన్మానించారు. అనంతరం విజయ డెయిరీ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. 11వ డివిజన్ పరిధిలోని బండమీదిపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన విజయ్ డెయిరీ పాల పదార్థాల ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించారు.
చిన్నచింతకుంట మండలం లాల్కోట గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో చిలుకటి సునీత ఏర్పాటు చేసిన విజయ డెయిరీ తెలంగాణ పార్లర్ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. నగర మేయర్ మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్‌రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కార్పొరేషన్ కమిషనర్ రామాంజనేయులు రెడ్డి పాల్గొన్నారు.
