ప్రతిపక్ష పార్టీల బెదిరింపులకు భయపడితే పనులు జరగవు : గుత్తా సుఖేందర్​రెడ్డి

ప్రతిపక్ష పార్టీల బెదిరింపులకు భయపడితే పనులు జరగవు : గుత్తా సుఖేందర్​రెడ్డి

నల్గొండ, వెలుగు : గుత్తా సుఖేందర్​రెడ్డి ప్రతిపక్షాల బెదిరింపులకు భయపడితే పనులు జరగవని మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల సీఎంల కలయిక శుభపరిణామమని, చర్చించుకుంటే కచ్చితంగా 90 శాతం విభజన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు తెలంగాణకు సంబంధించి కృష్ణా నదీ జలాల సమస్య ఉందని, ఏపీకి పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు ప్రత్యాయమ్నంగా ఉన్నాయన్నారు. కానీ, నల్గొండ, ఖమ్మం, జిల్లాలు పూర్తిగా ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి ఉన్నందున కృష్ణాజలాల్లో రాష్ట్ర వాటా కచ్చితంగా ఇవ్వాల్సిందేనేనన్నారు. 

శాసనమండలి రద్దు అనేది లేదని, 2026లో పునర్విభజన చట్టం అమలైతే తెలంగాణలో 34, ఏపీలో 50 సీట్లు పెరుగుతాయన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డితో ప్రత్యేకంగా చర్చించానని, జిల్లాలోని ఇద్దరు మంత్రులూ ప్రాజెక్టులు కంప్లీట్​ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రెండేండ్లలో ఎస్ఎల్​బీసీ టన్నెల్​ పనులు పూర్తవుతాయన్నారు. 

రైతుబంధు పది ఎకరాల్లోపు వరకు సీలింగ్​ పెడితే  బాగుటుందన్నారు. అర్హులైన వారికే రైతుబంధు, రైతుబీమా ఇవ్వాలని చెప్పారు. రాళ్లు రప్పలు, కొండలు, గుట్టలు, భూసేకరణలో భూములు కోల్పోయిన వాళ్లకు కూడా రైతుబంధు ఇచ్చారని, అలాంటి వాటిన్నింటినీ జాబితాల్లోంచి తొలగించాలని, ఐటీ రిటర్న్ కడుతున్న వాళ్లు, ప్రభుత్వ ఉద్యోగులను తీసేయాలని, కేవలం సాగుయోగ్యంగా ఉండే భూములకే రైతు భరోసా ఇవ్వాలని కోరారు. రైతుభరోసాపైన ప్రజాభిప్రాయసేకరణ చేయడం మంచిదేనని గుత్తా తెలిపారు.   

నల్గొండ, వెలుగు : ప్రతిపక్షాల బెదిరింపులకు భయపడితే పనులు జరగవని మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల సీఎంల కలయిక శుభపరిణామమని, చర్చించుకుంటే కచ్చితంగా 90 శాతం విభజన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు తెలంగాణకు సంబంధించి కృష్ణా నదీ జలాల సమస్య ఉందని, ఏపీకి పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు ప్రత్యాయమ్నంగా ఉన్నాయన్నారు. కానీ, నల్గొండ, ఖమ్మం, జిల్లాలు పూర్తిగా ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి ఉన్నందున కృష్ణాజలాల్లో రాష్ట్ర వాటా కచ్చితంగా ఇవ్వాల్సిందేనేనన్నారు. 

శాసనమండలి రద్దు అనేది లేదని, 2026లో పునర్విభజన చట్టం అమలైతే తెలంగాణలో 34, ఏపీలో 50 సీట్లు పెరుగుతాయన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డితో ప్రత్యేకంగా చర్చించానని, జిల్లాలోని ఇద్దరు మంత్రులూ ప్రాజెక్టులు కంప్లీట్​ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రెండేండ్లలో ఎస్ఎల్​బీసీ టన్నెల్​ పనులు పూర్తవుతాయన్నారు. రైతుబంధు పది ఎకరాల్లోపు వరకు సీలింగ్​ పెడితే  బాగుటుందన్నారు. అర్హులైన వారికే రైతుబంధు, రైతుబీమా ఇవ్వాలని చెప్పారు. 

రాళ్లు రప్పలు, కొండలు, గుట్టలు, భూసేకరణలో భూములు కోల్పోయిన వాళ్లకు కూడా రైతుబంధు ఇచ్చారని, అలాంటి వాటిన్నింటినీ జాబితాల్లోంచి తొలగించాలని, ఐటీ రిటర్న్ కడుతున్న వాళ్లు, ప్రభుత్వ ఉద్యోగులను తీసేయాలని, కేవలం సాగుయోగ్యంగా ఉండే భూములకే రైతు భరోసా ఇవ్వాలని కోరారు. రైతుభరోసాపైన ప్రజాభిప్రాయసేకరణ చేయడం మంచిదేనని గుత్తా తెలిపారు.