
శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ(సోమవారం) ఉదయం ఆయనతో మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి హాజరయ్యారు.
2021 జూన్ మూడు వరకు గుత్తా ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.