గద్వాల జిల్లాలో పత్తి కొనుగోలుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల జిల్లాలో పత్తి కొనుగోలుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు : జిల్లాలో పత్తి కొనుగోలుకు కేంద్రాలను పక్కాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ అగ్రికల్చర్, మార్కెటింగ్, ప్రణాళిక శాఖ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పత్తి కొనుగోళ్ల కోసం గద్వాలలో రెండు, ఆలంపూర్ లో ఒక కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అక్టోబర్ నెల చివరి నుంచి కొనుగోలు ప్రారంభించాలన్నారు. 

పత్తి కొనుగోలు పారదర్శకంగా ఉండేలా చూడాలన్నాని చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని సౌలతులు కల్పించాలని సూచించారు. పత్తి కొనుగోలుకు కిసాన్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని రైతులకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఏఈవోలకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. సమావేశంలో మార్కెటింగ్ ఆఫీసర్ పుష్పమ్మ, అగ్రికల్చర్ ఏడీ సంగీతలక్ష్మి, సీసీఐ అసిస్టెంట్ మేనేజర్ దిలీప్ తదితరులుపాల్గొన్నారు.