జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు లబ్ధి

జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు లబ్ధి
  • బీజేపీ ఎంపీకొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ సవరణలు సామాన్య ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుస్తాయని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో ఏ దేశం ఇంత తక్కువగా జీఎస్టీని సవరించలేదని, ఇది కేంద్రం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయమని చెప్పారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో జీఎస్టీ రేట్ల తగ్గింపు అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు పార్టీ నేతలతో సమావేశమైన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. 

‘‘కేంద్రం జీఎస్టీని తగ్గించడంతో ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం తగ్గుతుంది. అయినా ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దీన్ని ఒక సంక్షేమ పథకంలాగే చూడాలి’’ అని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి,  గౌతమ్ రావు తదితరులు పాల్గొన్నారు.