మహిళా కండక్టర్‌‌పై దాడి.. భలేగా బుద్ధి చెప్పిన ప్యాసింజర్

మహిళా కండక్టర్‌‌పై దాడి.. భలేగా బుద్ధి చెప్పిన ప్యాసింజర్

న్యూఢిల్లీ: మహిళా బస్సు కండక్టర్‌‌పై దాడి చేసిన ఓ ఆకతాయికి మరో ప్యాసింజర్ బుద్ధి చెప్పిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. రష్యాలో జరిగినట్లుగా చెబుతున్న ఈ వీడియో నెట్‌‌లో వైరల్ అవుతోంది. వివరాలు.. ఒక బస్సులో ప్రయాణికుడ్ని మహిళా కండక్టర్ ఏదో అడగ్గా సదరు ప్యాసింజర్ ఆమె ముక్కుపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె భయపడగా.. దాడి చేసిన ప్యాసింజర్‌‌పై బస్సులో ఉన్న మరో ప్రయాణికుడు అటాక్ చేశాడు. కండక్టర్‌‌పై దాడి చేయడాన్ని సహించని సదరు ప్రయాణికుడు ఆకతాయిపై ముష్టి ఘాతాలకు దిగాడు. ఆ తర్వాత ప్యాంటు జేబులో నుంచి పెప్పర్ స్ప్రేను తీసి ఆకతాయి కళ్లలో కొట్టాడు. దీంతో ఆకతాయి సీటుపై పడిపోగా ప్యాసింజర్ మరోసారి అతడ్ని కాళ్లతో  బలంగా తన్నాడు. ఆకతాయికి బుద్ధి చెప్పిన ప్యాసింజర్‌‌పై నెటిజన్స్ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.