Guy Whittall: చిరుతపులి దాడి.. ప్రాణాలతో బయటపడిన జింబాబ్వే మాజీ క్రికెటర్

Guy Whittall: చిరుతపులి దాడి.. ప్రాణాలతో బయటపడిన జింబాబ్వే మాజీ క్రికెటర్

జింబాబ్వేకు మాజీ క్రికెటర్‌ విట్టల్ ప్రాణాల నుంచి బయటపడ్డాడు. ఇటీవల హ్యుమానీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన అతను చిరుత పులి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచార ప్రకారం..పర్వతం ఎక్కుతుండగా విట్టల్‌పై చిరుతపులి ఒక్కసారిగా దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన తన పెంపుడు కుక్క చికారా.. యజమానిని రక్షించేందుకు తీవ్రంగా  ప్రయత్నించింది. ఈ ప్రక్రియలో అది తీవ్రంగా గాయపడిన విట్టాల్‌ను పోరాడి రక్షించింది.

చిరుతపులితో పోరాడుతున్న సమయంలో పెంపుడు కుక్కకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆయన భార్య హన్నా స్టోక్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని.. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. 2013 లో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని.. మొసలి విట్టల్ నివాసంలోకి ప్రవేశించి అతని మంచం కిందకు పాకిందని ఆమె తెలిపారు.

విట్టల్ 1993- 2003 మధ్య జింబాబ్వే తరపున 46 టెస్టులు, 147 వన్డేలు ఆడాడు. రెండు ఫార్మాట్లలో 4912 పరుగుయ్లు చేశాడు. బౌలింగ్ లోనూ సత్తా చాటి టెస్టులో 51 వికెట్లు, వన్డేల్లో 88 వికెట్లు పడగొట్టాడు.