
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, దివ్యభారతి జంటగా నటించిన చిత్రం ‘కింగ్‌స్టన్’. కమల్ ప్రకాష్ దర్శకుడు. నేడు శుక్రవారం (మార్చి 7న) థియేటర్లలలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో మహేశ్వర్ రెడ్డి రిలీజ్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. .
కథేంటంటే:
తమిళనాడు సముద్ర తీర గ్రామంలోని తూవత్తూర్‌లో జరిగే కథ ఇది. సముద్రాన్ని నమ్ముకునే ఆ ఊరు బ్రతుకుతుంది. కానీ, ఉన్నట్టుండి ఆ ఊరికి సముద్రం వైపు చూస్తేనే భయం పుట్టుకొస్తుంది. కొంతమంది మత్స్యకారులు ఉపాధి కోసం తెగేసి వెళ్లిన, సముద్రంలోనే శవాలై కలిసిపోతారు. అలా సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు ఎప్పటికీ తిరిగి రారని పుకారు ఆ ఊరిని చుట్టుముడుతుంది. దాంతో వారు పూర్తిగా సముద్రం వైపే వెళ్లడం మానేస్తారు. అలాగే మరికొన్ని కారణాల వాళ్ళ అక్కడి ప్రభుత్వం చేపలు పట్టడం కూడా పూర్తిగా నిషేధం విదిస్తుంది.
ఈ క్రమంలో ఆ ఊరి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళుతూ ఉంటారు. కానీ, అదే ఊరికి చెందిన కింగ్‌స్టన్ (జీవి ప్రకాష్ కుమార్) మాత్రం సముద్రంలోకి ఎలాగైనా చేపల వేటకు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ, పడవ కొనడానికి డబ్బులు లేకపోవడంతో ఇల్లీగల్ వ్యవహారాలు నడిపే థామస్ (సాబుమన్) దగ్గర తనతో పాటు తన ఫ్రెండ్స్, లవర్ (దివ్యభారతి) జాయిన్ అవుతారు. అయితే ఒకరోజు అనూహ్యంగా శ్రీలంక నేవీ వాళ్లు ఈ మత్స్య కారులను పట్టుకుంటారు. ఈ క్రమంలో ఓ యువకుడు చనిపోతాడు. దాంతో కింగ్‌స్టన్ థామస్ చేస్తున్న అక్రమ వ్యవహారాలు గుర్తిస్తాడు.
ఇక థామస్ కే ఎదురు తిరిగి, గతంలో తాను చేసిన చీకటి రహస్యాలను వెలికితీసేందుకు కింగ్‌స్టన్ సముద్రంలోకి వెళతాడు. అలా సముద్రంలోకి వెళ్లిన కింగ్‌స్టన్ కు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి? కింగ్‌స్టన్ బృందాన్ని సముద్రంలోని ఆత్మలు ఏం చేశాయి? సముద్రంలోకి వెళ్లిన వారు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏమిటి? నిజంగానే అక్కడ దెయ్యాలు, ఆత్మలున్నాయా? ఇలాంటి మిస్టరీ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే థియేటర్లో కింగ్‌స్టన్ చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
సముద్రాన్ని నమ్ముకునే బ్రతికే తీర ప్రాంత ప్రజల గురించి తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. చేపల వేట, డ్రగ్స్ అక్రమ రవాణా, చేపలకు బదులు తుపాకులు, సముద్ర వస్తువులకు బదులుగా మాదకద్రవ్యాలు, సముద్ర ప్రేమ కథలు.. ఇలా ప్రతి జానర్ లో సినిమాలు వచ్చాయి. కానీ, ఆ సినిమాలకు భిన్నంగా కింగ్‌స్టన్ మిస్టరీ అంశాలను తీసుకొచ్చింది.
ALSO READ | OTT Thriller: ఓటీటీలోకి వంద కోట్ల తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సముద్ర ఫాంటసీ హర్రర్ అంశాల చుట్టూ సినిమా సాగింది. కథలోని మలుపుల కోసం దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేస్తుంది. మత్స్యకార కుటుంబాల్లో ఉన్నట్టుండి ఉపాధి కోల్పోతే, వారిలో ఎదురయ్యే సంఘర్షణను ఎమోషనల్ గా చూపించిన విధానం బాగుంది. ఫస్టాఫ్ లో పూర్తిగా తీర ప్రాంతం, థామస్ అక్రమ దందా, మత్స్యకారుల పరిస్థితులు, ఊరు విడిచి వెళ్లడం చూపించాడు.
ఇక ప్రీ ఇంటర్వెల్ కు ముందు కింగ్ గాల్‌ఫ్రెండ్ రోజీ (దివ్యభారతి) నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ సెకండాఫ్ పై ఆసక్తి పెంచుతుంది. ఇక సెకండాఫ్ లో వచ్చే మిస్టరీ థ్రిల్లర్ సీన్స్, అప్పుడొచ్చే విజువల్స్‌తోనూ, సంగీతంతోనూ హైప్ ఇస్తుంది. హారర్, అడ్వెంచర్స్, థ్రిల్లర్ అంశాలు ఆడియన్స్ కు మంచి థ్రిల్ ఇస్తాయి.
ఎవరెలా చేశారంటే:
హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్ గా జీవీ ప్రకాష్ అదరగొట్టాడు. మత్స్యకార ఫ్యామిలీకి చెందిన యువకుడిగా గుర్తుండిపోయేలా నటించాడు. బ్యాచిలర్ సినిమాలో తన గ్లామర్ తో యూత్ కు నిద్ర లేకుండా చేసిన.. ఇందులో పల్లెటూరి యువతిగా డీ గ్లామర్ రోల్ లో మెప్పించింది. బోసయ్య పాత్రలో అజగన్ పెరుమాళ్, థామస్ పాత్రలో సబూమాన్ తమ తమ పాత్రల్లో జీవించేసారు.
సాంకేతిక అంశాలు:
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ బీజీఎమ్ అదిరిపోయింది. పాటలు పెద్దగా ఆకట్టుకోపోయినా, బీజీఎమ్ తో చింపేశాడు. స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ తన ప్రతిభ చూపించాడు. డైరెక్టర్ కమల్ ప్రకాష్ తనదైన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. హారర్ తో మెప్పించినప్పటికీ, ఎమోషన్స్ సీన్స్ లో తన పెన్నుకీ పదునుపెట్టాల్సి ఉంది.