
గువాహటి: హైదరాబాద్ యంగ్ షట్లర్ జ్ఞాన దత్తు.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం (అక్టోబర్ 16) జరిగిన బాయ్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జ్ఞాన దత్తు 15–12, 15–13తో ఎనిమిదో సీడ్ గారెట్ టాన్ (అమెరికా)పై గెలిచాడు. కెరీర్‌లో తొలిసారి వరల్డ్ జూనియర్స్ ఆడుతున్న జ్ఞాన దత్తు అద్భుతంగా ఆడాడు.
విమెన్స్ సింగిల్స్‌లో టాప్ సీడ్ తన్వి శర్మ 15–8, 15–5తో లి యువాన్ సన్ (చైనా)పై, ఉన్నతి హుడా 15–10, 15–7తో కారిన్ టీ (మలేసియా)పై గెలవగా, రక్షిత శ్రీ 11–15, 9–15తో రణితమ లియాగే (శ్రీలంక) చేతిలో ఓడింది. విమెన్స్ డబుల్స్‌లో వెన్నెల కలగొట్ల–రేష్మిక 16–14, 12–15, 8–15తో సల్సాబిలా అవులియా–జానియా సితుమోరాంగ్ (ఇండోనేసియా) చేతిలో, అనయా బిస్త్–ఎంజెల్ పునెరా 7–15, 8–15తో చియోన్ హే యిన్–మూన్ ఇన్ సియో (కొరియా) చేతిలో ఓడారు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో భవ్య చాబ్రా–విశాఖ టొప్పో 12–15, 15–11, 15–12తో తిబుల్ట్ గార్డన్–అగ్తె కువెస్ (ఫ్రాన్స్)పై నెగ్గి ముందంజ వేశారు. మెన్స్ డబుల్స్‌లో భార్గవ్ రామ్–విశ్వ తేజ్ గొబ్బురు 13–15, 15–9, 15–13తో యి సుయాన్ చెన్–చున్ యు చు (చైనీస్‌తైపీ)పై నెగ్గారు.