వారణాసిలో ప్రస్తుతం జ్ఙాన్వాపి మసీదు అంశం హీట్ పుట్టిస్తోంది. మసీదులో శివలింగం దొరికిందనే ప్రచారం హోరెత్తుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. శివలింగం బయటపడితే ఆ ప్రాంతాన్ని పరిరక్షించాలని, అన్ని వర్గాల మధ్య సమతుల్యత పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. జిల్లా మేజిస్ట్రేటు ఆ ప్రాంతాన్ని పరిరక్షించాలని, ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి అంతరాయం కలిగించవద్దని సూచించింది. వారాణసి ట్రయల్ కోర్టులో విచారణ పూర్తయిన తరువాత పరిశీలించడం జరుగుతుందని వెల్లడించింది. తదుపరి విచారణ గురువారం చేపడతామని సుప్రీంకోర్టు జడ్జిలు చంద్రచుడ్, నరసింహం ధర్మాసనం పేర్కొంది.
వారణాసి సర్వే కమిషనర్ అజయ్ మిశ్రాను వారణాసి హైకోర్టు తొలగించింది. రిపోర్టుని ముందుగా లీక్ చేసినందుకు ఆయనపై తగిన చర్యలు తీసుకుంది. రిపోర్టు ఇల్లీగల్ గా ఉందంటూ సుప్రీంకోర్టు ముందు ముస్లిం సంఘాల తరపు లాయర్ వాదించారు. మజీద్ సీజ్ చేయడం అంటే ఆస్తులను సీజ్ చేయడంలాంటిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బాబ్రీ మజీద్ జడ్జిమెంట్ కు ఇది వ్యతిరేకమని వాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరఫున సొలిటరీ జనరల్ వాదనలు వినిపించారు. మసీదులోని బావిలో 12.8 అడుగుల పొడవైన శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయిస్తే.. ఆ ప్రదేశాన్ని సీజ్ చేయాలని అధికారులకు న్యాయమూర్తి ఆదేశించారు. దీనిపై ముస్లిం నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కనిపించింది శివలింగం కాదని.. అది ఫౌంటెయిన్ లో భాగమని వాదిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం : -
