
వాషింగ్టన్: అమెరికాలో టెంపరరీగా ఉద్యోగం చేసేందుకు జారీ చేసే హెచ్ 1 బీ వీసాల రిజిస్ట్రేషన్లను మార్చిలో ప్రారంభించనున్నట్లు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) వెల్లడించింది. 2023 ఫైనాన్షియల్ ఇయర్ కు గాను మార్చి 1 నుంచి 18 వరకు సంస్థలు, ప్రతినిధులు ఆన్ లైన్ లో 10 డాలర్ల ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. అప్లికేషన్లను ర్యాండమ్ గా సెలక్ట్ చేసి, ఎంపికైన వాళ్లకు మార్చి 31 నాటికి సమాచారం ఇస్తామని చెప్పింది. హెచ్ 1 బీ నాన్ ఇమిగ్రేషన్ వీసా. వివిధ రంగాల్లోని ఎక్స్ పర్ట్ లు తమ దేశంలో పని చేసేందుకు అమెరికా ఏటా 65 వేల హెచ్ 1 బీ వీసాలను జారీ చేస్తుంది. ఇవి కాకుండా అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ లో హయ్యర్ స్టడీస్ పూర్తి చేసిన స్టూడెంట్లకు మరో 20 వేల హెచ్ 1 బీ వీసాలు ఇస్తుంది.