హ్యాకథాన్ బ్రాండ్ అనుమతులు బదిలీ

హ్యాకథాన్ బ్రాండ్ అనుమతులు బదిలీ

హైదరాబాద్​, వెలుగు: హ్యాకథాన్ బ్రాండ్ తెలంగాణ రాష్ట్ర అనుమతులు రాపర్తి హరి సాయి గౌడ్ కు దక్కాయి. ఈ బ్రాండ్ యజమాని సందీప్ కుమార్ మక్తాల 2026 సంవత్సరానికి సంబంధించిన వినియోగ హక్కులను అధికారికంగా అందజేశారు. దీని ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు తెలంగాణలో జరిగే టెక్నాలజీ పోటీలు, స్టార్టప్ కార్యక్రమాలను హరి సాయి గౌడ్ నిర్వహిస్తారు. 

యువతలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ బ్రాండ్ ప్రధాన ఉద్దేశం. బాధ్యతాయుతమైన నిర్వహణ కోసం ఈ లైసెన్సింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సందీప్  తెలిపారు. ఈ వేదిక ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.