
హైదరాబాద్, వెలుగు : హాయర్ అప్లయెన్సెస్ ఇండియా తన ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషర్ డ్రయర్ వాషింగ్ మెషీన్‌ను లాంచ్ చేసింది. డ్యూయల్ సైక్లోన్ ఫీచర్ ఇందులోని ప్రత్యేకత అని తెలిపింది. ఇది దుస్తులను సమర్థవంతంగా ఎండబెడుతుంది. అవి ఎక్కువ కాలం మన్నుతాయి.
ఇది ఎక్కువగా శబ్దం చేయదని, వాషర్ ఎక్కువకాలం వస్తుందని కంపెనీ పేర్కొంది. విశాలమైన 525 మిమీ సూపర్ డ్రమ్ కారణంగా ఎక్కువ బట్టలను వేయవచ్చు. ప్రీమియం డార్క్ జేడ్ సిల్వర్ కలర్‌లో లభించే ఈ వాషర్ ధర రూ.85 వేలు.