కాంగ్రెస్‍ ఎమ్మెల్యేల్లో సగం మందికి టికెట్లు రావు..రాహుల్ గాంధీ యువతకే ప్రాధాన్యం ఇస్తున్నారు

కాంగ్రెస్‍ ఎమ్మెల్యేల్లో సగం మందికి టికెట్లు రావు..రాహుల్ గాంధీ యువతకే ప్రాధాన్యం ఇస్తున్నారు
  • రాష్ట్ర ఆయిల్‍ ఫెడ్‍ కార్పొరేషన్‍ మాజీ చైర్మన్‍ జంగా రాఘవరెడ్డి

వరంగల్‍, వెలుగు: రాహుల్‍గాంధీ యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇప్పుడున్న కాంగ్రెస్‍ ఎమ్మెల్యేల్లో సగం మందికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు రావని రాష్ట్ర ఆయిల్‍ ఫెడ్‍ కార్పొరేషన్‍ మాజీ చైర్మన్‍ జంగా రాఘవరెడ్డి తెలిపారు.

 హనుమకొండ టేకులగూడెంలోని తన ఇంట్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‍రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత అలా మాట్లాడటం మూమ్మాటికీ తప్పేనన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో, దానికి చెక్‍ పెట్టేందుకు సీఎం అలా మాట్లాడి ఉంటారన్నారు. 

సుస్మిత ఎన్నికల ముందు టికెట్ అడిగితే ఇచ్చేవారు కావొచ్చని.. కానీ, ఆమె తొందరపాటు సరికాదన్నారు. కాంగ్రెస్‍ పార్టీలో టికెట్‍ అనేది సీఎం రేవంత్‍రెడ్డి చేతిలో కూడా ఉండదని, అది అదిష్టానం చేతుల్లో మాత్రమే ఉంటుందన్నారు. అదే సమయంలో  సీఎంగా రేవంత్‍రెడ్డి 5‌‌0 నుంచి 60 మందికి టిక్కెట్లు ఇప్పించుకుంటారని తెలిపారు.