అమెరికా ప్రతిపాదనకు హమాస్ ఓకే.. పది మంది బందీలను, విడుదల చేస్తామని ప్రకటన

అమెరికా ప్రతిపాదనకు హమాస్ ఓకే.. పది మంది బందీలను,  విడుదల చేస్తామని ప్రకటన

గాజా: అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌‌కాఫ్ రూపొందించిన సీజ్‌‌ఫైర్ ప్రతిపాదనకు హమాస్ శనివారం స్పందించింది. గాజాలోని10 మంది జీవించి ఉన్న ఇజ్రాయెలీ బందీల విడుదలతోపాటు 18 డెడ్ బాడీలను ఇజ్రాయెల్ కు ఇచ్చేందుకు హమాస్ అంగీకరించింది. దీనికి బదులుగా ఇజ్రాయెల్ కూడా పాలస్తీనియన్ బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌‌కాఫ్ రూపొందించిన.  ఈ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.

అయితే, హమాస్ మాత్రం శాశ్వత సీజ్‌‌ఫైర్, గాజా నుంచి ఇజ్రాయెల్ సైనిక దళాల పూర్తి ఉపసంహరణ, గాజాకు నిరంతర మానవతా సహాయం అందించడం, గాజా పునర్నిర్మాణానికి మార్గం సుగమం చేయడం వంటి కొన్ని కీలక హామీలను ప్రతిపాదనలో  చేర్చాలని డిమాండ్ చేసింది. అయితే, దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. కానీ, ప్రధాని నెతన్యాహూ మాత్రం బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ తాను ఆ ఒప్పందానికి అంగీకరిస్తానని చెప్పారు. తాజాగా  హమాస్ కూడా విట్‌‌కాఫ్ ప్రతిపాదనకు అనుకూలంగా ప్రకటన చేసింది.