డీసీసీబీ కార్యకలాపాలు సమర్థంగా నిర్వహించాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

డీసీసీబీ కార్యకలాపాలు సమర్థంగా నిర్వహించాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్(డీసీసీబీ) కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. హనుమకొండ డీసీసీబీ బ్యాంక్ ను చైర్ పర్సన్ హోదాలో కలెక్టర్ మంగళవారం సందర్శించారు. డీసీసీబీ పరిధిలోని జిల్లా సహకార శాఖ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. 

బ్యాంక్ సాధించిన రికవరీలు, సొంత డిపాజిట్లు, బ్యాంకు ప్రాపర్టీలు, లోనింగ్ పాలసీ, ఉద్యోగుల పని తీరు తదితర విషయాలపై సమీక్షించారు. బ్యాంక్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చట్టప్రకారం విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ డీసీవోలు సంజీవ రెడ్డి, కోదండరాం, వాలు నాయక్, నీరజ, డీసీసీబీ సీఈవో వజీర్ సుల్తాన్, డీపీఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు.