హనుమకొండ సిటీ, వెలుగు: దేశంలో పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచడానికి సైన్స్ ఫెయిర్ ఎంతగానో దోహదపడతాయని పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‍రెడ్డి, కేఆర్ నాగరాజు తెలిపారు. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో హనుమకొండ సెయింట్ పీటర్స్ స్కూల్ ఆవరణలో మూడురోజుల సైన్స్ ఫెయిర్ నిర్వహించగా, శనివారం హనుమకొండ డీఈవో ఎల్.వీ.గిరిగౌడ్ అధ్యక్షతన ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సైన్స్ ద్వారా సమాజంలోని మూఢనమ్మకాలు, రుగ్మతలు పారద్రోలాలని చెప్పారు.
డీఈవో మాట్లాడుతూ సైన్స్‌ఫెయిర్‌ను విజయవంతం చేసిన టీచర్లు, స్టూడెంట్లకు అభినందనలు తెలిపారు. అనంతరం విజేతలతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సైన్స్ ఫెయిర్ ఆఫీసర్ శ్రీనివాసస్వామి, సీఎంవో బద్ధం సుదర్శన్‍రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి రామ్‍ధన్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సదానందం, సెయింట్ పీటర్స్ విద్యాసంస్థల అధినేత నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయిసైన్స్ ఫెయిర్ కి విద్యార్థి ఎంపిక
ధర్మసాగర్ : హనుమకొండ జిల్లాలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో తాటికాయల జడ్పీహెచ్ఎస్ టెన్త్‌క్లాస్ విద్యార్థి ఆమంచ గీతిక శ్రీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. గ్రామానికి చెందిన ఆమంచ రమేశ్ కుమార్తె గీతిక శ్రీ “మున్సిపల్ నీటి లీకేజీని స్వయంచాలకంగా గుర్తించే విధానం” అనే అంశంపై రూపొందించిన ప్రాజెక్ట్ జిల్లా స్థాయి న్యాయనిర్ణేతల ప్రశంసలు పొందింది. ఈ ప్రాజెక్ట్‌కు టీచర్లు పి. దీప్తి, జి.ఉషారాణి మార్గదర్శకంలో రాష్ర్ట స్థాయికి ఎంపికైనట్లు విద్యార్థి తెలిపింది. కాగా, వారిని హెచ్ఎం ఫాతిమా మేరీతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
