రేపు కేరళకు రుతుపవనాలు

రేపు కేరళకు రుతుపవనాలు

న్యూఢిల్లీ: ఈసారి రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. ఈ నెల 4న వస్తాయనుకున్న రుతుపవనాలు.. మూడు నాలుగు రోజులు ఆలస్యంగా ఈ నెల 7న రుతుపవనాలు కేరళను తాకే చాన్స్ ఉందని వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. ‘‘దక్షిణ అరేబియా సముద్రం మీదుగా గాలులు వీస్తున్నాయి. అవి క్రమంగా బలపడుతున్నాయి. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంది. ఇవన్నీ రుతుపవనాల రాకకు అనుకూలిస్తాయి. మరో ఒకటి రెండు రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది” అని ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ నెల 4న రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇంతకుముందు అంచనా వేసింది.